బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 07:13:12

ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభం

ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభం

హైదరాబాద్‌, : రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియను ప్రారంభమైనట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత అనుభవం నేపథ్యంలో అన్ని స్పాట్‌ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లుచేశామని చెప్పారు. వాల్యుయేషన్‌లో మూడంచెల విధానాన్ని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి ఫలితాల విడుదలకు వీలుగా.. రోజూ రెండు పూటల వాల్యుయేషన్‌ కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలతోపాటు హైదరాబాద్‌, రంగారెడ్డిలో అదనంగా రెండు స్పాట్‌ కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. 


logo
>>>>>>