ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 11:31:29

18న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

18న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : ఈ నెల 18న సాయంత్రం.. తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్‌ ప్రథమ,  ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంటర్‌ పరీక్షా ఫలితాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, తుది నివేదికను విద్యాశాఖకు సమర్పించినట్లు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ తెలిపారు. 

ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకు కొనసాగిన విషయం విదితమే.


logo