సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 28, 2021 , 17:13:17

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 20 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు  నిర్వహంచనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 

ఏప్రిల్‌ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష,  ఏప్రిల్‌ 3న  ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని  ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలకూ ఇదే షెడ్యూల్‌ వర్తించనుంది.  పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి నిర్వహించే అవకాశం ఉంది. 


VIDEOS

logo