శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 21:52:52

సాగునీటి రంగంలో తెలంగాణది అత్యున్నతమైన స్థానం

సాగునీటి రంగంలో తెలంగాణది అత్యున్నతమైన స్థానం

హైదరాబాద్‌ : ఈ దేశంలో తెలంగాణ సాగునీటి రంగంలో అత్యున్నతమైన స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వ పనితీరును ఈ దేశానికి దశ-దిశ నిర్దేశం చేసే నీతిఆయోగ్‌ ప్రశంసిందని తెలిపారు. ఈ దేశ సాగునీటి రంగానికి దశ-దిశను నిర్దేశించేటట్వంటి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ చైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌ హైదరాబాద్‌కు వచ్చి మన ప్రాజెక్టులను చూసి అబ్బురపడిపోయి, ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, రాష్ట్రప్రభుత్వాన్ని అభినందించారు. సీడబ్య్లూసీ ఛైర్మన్‌ వచ్చాడంటే ఎంతోకొంత తప్పులు, లోటుపాట్లను గుర్తిస్తారు. కానీ మసూద్‌ హుస్సేన్‌ ప్రభుత్వ పనితీరును అభినందించి దేశానికి మేం నేర్పిస్తాం. కానీ తెలంగాణకు వచ్చి నేను నేర్చుకునాన్నన్నారు. మా సీడబ్య్యూసీ ఇంజినీర్లను మీ రాష్ర్టానికి పంపిస్తాం. దయచేసి వాళ్లకు ఈ ప్రాజెక్టులు చూపించండి. మావాళ్లు నేర్చుకుంటారని చెప్పి. దేశవ్యాప్తంగా సీడబ్ల్యూసీ ఇంజినీర్లను మూడు బృందాలుగా మన హైదరాబాద్‌కు, తెలంగాణకు పంపించి మన ప్రాజెక్టులను చూసి నేర్చుకుని పోవడమంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు.  


logo