శనివారం 04 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 21:34:17

తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆదివారం 983 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 816 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14,419 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ నలుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 247కు చేరింది. ఇవాళ 244 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 5172 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 9వేల మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

 ఆదివారం 3227 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 82,458 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.  జీహెచ్‌ఎంసీ పరిధిలో 816, రంగారెడ్డి జిల్లాలో 47, మేడ్చల్‌లో 29, మంచిర్యాలలో 33, భద్రాద్రి కొత్తగూడెంలో 5, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 19, అర్బన్‌ జిల్లాలో 12, నల్లగొండ, కరీంనగర్‌, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో 3చొప్పున, ఆదిలాబాద్‌, గద్వాల జిల్లాల్లో 2చొప్పున, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, జనగామ మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 



logo