సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 07:08:59

కోడిగుడ్ల ఉత్ప‌త్తిలో మూడో స్థానంలో తెలంగాణ‌

కోడిగుడ్ల ఉత్ప‌త్తిలో మూడో స్థానంలో తెలంగాణ‌

హైద‌ర‌బాద్‌: కోడిగుడ్ల ఉత్ప‌త్తిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. దేశంలో ఉత్ప‌త్తి అవుతున్న గుడ్ల‌లో తెలంగాణ 13.2 శాతం వాటా క‌లిగి ఉన్న‌ద‌ని కేంద్ర ప‌శు సంవ‌ర్ధ‌క‌, పాడి ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ వెల్ల‌డించింది. దేశంలో సుమారు 65 శాతం గుడ్ల‌ను తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, హ‌ర్యానా రాష్ట్రాలే ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. 

మొత్తంగా దేశీయ కోడిగుడ్ల ఉత్ప‌త్తిలో 19.1 శాతంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలో ఉండ‌గా, 18.2 శాతంతో త‌మిళ‌నాడు, 13.2 శాతంతో తెలంగాణ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటి త‌ర్వాత 8.3 శాతంతో ప‌శ్చిమ‌బెంగాల్‌, 5.9 శాతంతో హ‌ర్యానా రాష్ట్రాలున్నాయ‌ని తెలిపింది.   


logo