గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 06, 2020 , 02:24:13

టాప్‌-3లో తెలంగాణ

టాప్‌-3లో తెలంగాణ

  • ఈవోడీబీలో వరుసగా మూడోసారి అగ్రస్థానం
  • పారిశ్రామిక రాష్ర్టాలను తలదన్నిన తెలంగాణ
  • ఫలించిన రాష్ట్ర మంత్రి కే తారకరామారావు కృషి 

పెట్టుబడులను ఆకర్షించడంలో పలు పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతున్న తెలంగాణ సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచింది. పారిశ్రామిక రాష్ర్టాలను తలదన్ని ఓవరాల్‌ పర్ఫార్మెన్స్‌లో మూడో ర్యాంకును సాధించింది. టీఎస్‌ఐపాస్‌ వంటి చట్టంతో ప్రపంచ పారిశ్రామికవేత్తల మన్ననలు పొందిన తెలంగాణ.. ఈవోడీబీలో 187 సంస్కరణలకుగాను 184 అమలుచేసింది. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ నిత్య పర్యవేక్షణ, ఆయా శాఖల సమిష్టి కృషితో ఈవోడీబీలో ముందంజలో కొనసాగుతూ.. కరోనా కష్టకాలంలోనూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సులభతర వాణిజ్యవిధానం (ఈవోడీబీ)లో మరోసారి తెలంగాణ తన సత్తా చాటింది. పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా జాతీయస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ర్టాలను, పారిశ్రామికంగా గుర్తింపుపొందిన రాష్ర్టాలతో పోటీపడి ముందు నిలిచింది. ఢిల్లీలో శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక-2019 ర్యాంకులను ప్రకటించారు. ఈ సారి కేవలం పేపర్‌ వర్క్‌ ద్వారానే కాకుండా ఈవోడీబీ ద్వారా లబ్ధిపొందిన పారిశ్రామికవేత్తలు, వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించి ర్యాంకులను ప్రకటించారు. నిర్మాణరంగ అనుమతులు, కార్మిక ని యంత్రణ, పర్యావరణ అనుమతులు, సమాచార సదుపాయం, భూమి లభ్యత వంటి అంశాల ప్రామాణికంగా  ర్యాంకులిచ్చారు. ఏపీ మొదటిస్థానంలో ఉండగా, రెండోస్థానంలో ఉత్తరప్రదేశ్‌ నిలిచాయి. ఈ కార్యక్రమంలో వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గో యల్‌ , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి తదితరులు పాల్గొన్నారు. 

సంస్కరణల్లో సమానమే అయినా!

ఈవోడీబీ ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్‌తో సమానంగా తెలంగాణ కూడా సంస్కరణలను అమలుచేసింది. మొ త్తం 187 సంస్కరణల్లో 184 ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ అమలుచేశాయి. ఈ రెండు రాష్ర్టా లు రెండు సంస్కరణలను అమలు చేయకపోగా, మిగిలిన ఒకటి వర్తించలేదు. అయినప్పటికీ తెలంగాణకు మూడో ర్యాంకు లభించడం విశేషం. సంస్కరణల వల్ల లబ్ధిపొందిన వారినుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ ఒక ర్యాంక్‌ ను కోల్పోయినట్టు తెలుస్తున్నది. కేవలం ఒకే ఒక పాయి ంట్‌ స్కోర్‌తో ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. 

టీఎస్‌ఐపాస్‌తో..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నేతృత్వంలో  అత్యద్భుతమైన నూతన పారిశ్రామికచట్టాన్ని తీసుకొచ్చారు. తెలంగాణపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు 15రోజుల్లోనే అనుమతులిచ్చే టీఎస్‌ఐపాస్‌ విధానాన్ని తీసుకొచ్చారు.  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే అనుమతులు వచ్చే విధానాన్ని తాము ఎక్కడా చూడలేదంటూ పారిశ్రామిక వేత్తలు అభినందించారు. టీఎస్‌ఐపాస్‌ చట్టం ఈవోడీబీలో తెలంగాణను వరుసగా టాప్‌- 3లో ఉండేలా దోహదంచేసింది. 

సీఐఐ అభినందనలు 

సులభతర వాణిజ్య విధానంలో తెలంగా ణ మూడో స్థానంలో నిలవడం పట్ల భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపింది. తెలంగాణ వరుసగా మూడేండ్ల పాటు టాప్‌ 3లో ఒకటిగా ని లుస్తున్నదని, ఇందుకు కృషిచేస్తున్న సీఎం కేసీ ఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను సీఐఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కృష్ణ బోడనపు ప్రశంసించారు. 

ఆరేండ్లలో మూడుసార్లు టాప్‌ 3

ఈవోడీబీలో ఇచ్చిన 187 సంస్కరణల్లో న్యాయశాఖకు సంబంధించిన రెండు మినహా మిగిలిన శాఖలకు ఇచ్చిన సంస్కరణలన్నింటిని తెలంగాణ పూర్తిచేసింది. ఈవోడీబీలో తెలంగాణ 2016లో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత 2017లో రెండో స్థాన ంలో, 2019లో మూడో స్థానంలో నిలిచింది. 2018లో ర్యాంకులు ప్రకటించలేదు. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి నేటివరకు సుస్థిరమైన ప్రభుత్వం, సమర్థ పాలన, పారిశ్రామిక అనుకూల విధానం, టీఎస్‌ఐపాస్‌, పెట్టుబడులపై నిత్యం సమీక్షించే పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ కృషితో రాష్ట్రం ఈవోడీబీలో అగ్రభాగాన నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడి ఆరేండ్లే అయినా.. గత మూడేండ్లుగా వరుసగా టాప్‌-3లో నిలవటం విశేషం. పారిశ్రామికరంగంలో గతంలో ఎంతో ముందున్న గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ వంటి పెద్ద రాష్ర్టాలను తలదన్ని తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కొత్త రాష్ట్రమైనా పెట్టుబడులను ఆకర్షించడంలో మాత్రం ముందంజలో ఉన్నది. 

పరిశ్రమల మంత్రి నిత్య పర్యవేక్షణ


ఈవోడీబీలో మెరుగైన స్థానం కోసం.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా కృషిచేస్తున్నారు. పరిశ్రమలశాఖపై నిరంతరం పర్యవేక్షణ, సమన్వయం, సమీక్షలు చేస్తూ.. పెట్టుబడిదారులతో సమావేశమవుతూ, తెలంగాణకు బ్రాండ్‌అంబాసిడర్‌గా తనదైన పాత్రను పోషిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రపంచస్థాయి పరిశ్రమలు తెలంగాణకు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. అన్ని శాఖలను సమన్వయంచేసి రా ష్ర్టాన్ని ముందు నిలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి సానుకూలంగా సంస్కరణలు ఉండేలా మార్పులు తెచ్చారు. పరిశ్రమలతో..ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న అన్ని శాఖలను భాగస్వాములను చేశారు. వారు చేపట్టిన సంస్కరణలకు మా ర్కులిచ్చారు. ప్రభుత్వ సంస్కరణలే కాకుండా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులనూ సంప్రదించి సమాచారాన్ని సేకరించారు. వారి అభిప్రాయాల ఆ ధారంగా స్కోర్‌లు వచ్చాయి. ఈవోడీబీ సంస్కరణల్లో విజయవంతానికి రాష్ట్రంలో ప్రతి శాఖకు ఒకరిని నోడల్‌ అధికారిగా నియమించారు. వీరు పరిశ్రమలశాఖ తో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగారు. ఈవోడీబీ సం స్కరణల లబ్ధిదారులు, వినియోగాదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేశారు. సంస్కరణల్లో చేయా ల్సిన మార్పులపై అభిప్రాయాలను తీసుకున్నారు. 2019 సంవత్సరంలో మొత్తం 187 సంస్కరణలపై ప్రశ్నలు అడిగారు. కేంద్ర వాణి జ్య మంత్రిత్వశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇం డస్ట్రీస్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) 2019 ఈవోడీబీని సమన్వయం చేసింది. 

ఈవోడీబీ ర్యాంకులపై ఉప రాష్ట్రపతి అభినందనలు 

సులభతర వాణిజ్య విధానం(ఈవోడీబీ)ను అమలుచేస్తున్న రాష్ర్టాల జాబితాలో మొదటి, మూడో స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలను ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. ఈవోడీబీలో ఉభయ తెలుగు రాష్ర్టాలు ముందు వరుసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకమని శనివారం ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 


logo