గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 13:50:06

సంక్షేమంలో దేశానికి తెలంగాణ మార్గ‌ద‌ర్శి : సీఎం కేసీఆర్

సంక్షేమంలో దేశానికి తెలంగాణ మార్గ‌ద‌ర్శి : సీఎం కేసీఆర్

మేడ్చ‌ల్ : స‌ంక‌ల్పం, చిత్త‌శుద్ధి ఉంటే ఏ స‌మ‌స్య‌నైనా ప‌రిష్క‌రించొచ్చు అని తెలంగాణ రాష్ర్టంలో నిరూపించామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఐదారు సంవ‌త్స‌రాల్లోనే సంక్షేమంలో, అభివృద్ధిలో దేశానికి తెలంగాణ మార్గ‌ద‌ర్శిగా నిలిచింద‌ని కేసీఆర్ తెలిపారు. మేడ్చ‌ల్ జిల్లా మూడుచింత‌ల‌ప‌ల్లిలో ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభించిన సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ‌లో మంచినీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపిస్తామ‌ని ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ త‌ర్వాత స్వ‌యంగా తానే శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించాను. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా శాశ్వ‌తంగా మంచినీటి స‌మ‌స్య‌ను పరిష్కారిస్తామ‌ని చెప్పాను. ఆ వాగ్దానాన్ని నెర‌వేర్చామ‌ని తెలిపారు. విజ‌య‌వంతంగా మిష‌న్ భగీర‌థ ప‌థ‌కం అమ‌ల‌వుతోంది. చాలా జ‌ఠిల‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌రెంట్ విష‌యంలో భార‌త‌దేశంలోనే త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌న్నారు. 26 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి స‌బ్‌స్టేష‌న్‌, ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసి నాణ్య‌మైన విద్యుత్‌ను 24 గంట‌ల పాటు వ్య‌వ‌సాయానికి, ఇత‌ర రంగాల‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు. సంక్షేమంలో దేశానికే మార్గ‌ద‌ర్శిగా ఉన్నామ‌ని తెలిపారు. గ‌త సంవ‌త్స‌రం ఎఫ్‌సీఐకి భార‌త‌దేశం మొత్తం 45 శాతం ధాన్యం ఇస్తే.. కేవ‌లం తెలంగాణ రాష్ర్టం 55 శాతం ధాన్యం ఇచ్చింద‌ని తెలిపారు. ఇది తాను డ‌బ్బా కొట్ట‌డం లేదు. ఇది స్వ‌యంగా ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించింది అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. 

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం.. 2014లో  త‌ల‌స‌రి ఆదాయం రూ. ఒక ల‌క్ష 12 వేలు.. ఐదారు సంవ‌త్స‌రాల్లో తెలంగాణ త‌ల‌సారి ఆదాయం రూ. 2 ల‌క్ష‌ల 28 వేలు. ఇది డ‌బుల్ అయింది. భార‌త‌దేశంలో త‌ల‌స‌రి ఆదాయంలో ఐదో స్థానంలో ఉన్నాం. ఆర్థిక ప్ర‌గ‌తిని సాధించామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.