శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 00:39:29

బక్రీద్‌కు ఆవులను బలివ్వొద్దు

బక్రీద్‌కు ఆవులను బలివ్వొద్దు

  • ముస్లింలకు హోంమంత్రి మహమూద్‌ అలీ విజ్ఞప్తి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బక్రీద్‌కు ముస్లింలు ఎవరూ గోవధకు పాల్పడవద్దని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ విజ్ఞప్తిచేశారు. బక్రీద్‌ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ ఎం మహేందర్‌రెడ్డితో శనివారం లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంతో మతసామరస్యం ఉన్నదని, సీఎం కేసీఆర్‌ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఇదే సోదరభావం కొనసాగేలా బక్రీద్‌ జరుపుకోవాలని సూచించారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆవులను బక్రీద్‌ సందర్భంగా బలి ఇవ్వవద్దని ముస్లింలను కోరారు. మేకలు ఇతర జంతువుల రవాణాలో పోలీసుల సహకారం ఉంటుందని, ఆవులను తరలించేవారిపై కేసులు నమోదుచేయడంతోపాటు జైలుకు పంపుతారని హెచ్చరించారు. బక్రీద్‌ సందర్భంగా శుభ్రతపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని, వ్యర్థాలను రోడ్లపైవేసి ఇతరులకు అసౌకర్యం కలిగించవద్దని సూచించారు. 


logo