సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 12:27:08

శ్రీవారిని ద‌ర్శించ‌కున్న‌ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌

శ్రీవారిని ద‌ర్శించ‌కున్న‌ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌

తిరుమ‌ల‌: ‌తెలంగాణ రాష్ట్ర‌ హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయ‌న‌ స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించిన అనంతరం ఆలయ రంగనాయక ‌మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను, పట్టువస్త్రాలను చీఫ్ జ‌స్టిస్‌కు అందజేశారు. 

అనంతరం తిరుమ‌ల‌లోనే టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవీ సుబ్బారెడ్డి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర చౌహాన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. శాలువ‌తో స‌త్క‌రించి శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.