మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 00:59:22

చివరి కార్మికుడి వరకు పర్యవేక్షణ

చివరి కార్మికుడి వరకు పర్యవేక్షణ

వలస కార్మికుల తరలింపుపై హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన ఇతర రాష్ర్టాల వలసకార్మికుల్లో చివరి వ్యక్తి స్వస్థలాలకు చేరుకునే వరకు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. వలసకార్మికులకు సంబంధించిన పిటిషన్లపై శుక్రవారం మరోసారి విచారించిన హైకోర్టు.. రాజ్యాంగపరిధికి లోబడే తన అధికారాలను వినియోగించుకుంటుందని, దీన్ని ఒకరిపై కత్తి దూయడంగా భావించరాదని వ్యాఖ్యానించింది. 

కాంగ్రెస్‌ నేతల అరెస్టు కేసుల్లో తీర్పు రిజర్వ్‌

పోలీసులు తమను అక్రమంగా నిర్బంధిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు దాఖలుచేసిన కేసుల్లో తీర్పును హైకోర్టు శుక్రవారం రిజర్వుచేసింది. కాంగ్రెస్‌ నాయకులు కొవిడ్‌-19 మార్గదర్శకాలను తీవ్రంగా ఉల్లంఘించారని ప్రభుత్వం పేర్కొన్నది. అన్నివర్గాల వాదనలు నమోదుచేసుకున్న ధర్మాసనం.. తీర్పును రిజర్వుచేసింది.logo