ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 01:38:53

శానిటరీ వర్కర్ల ఉద్యోగాలు క్రమబద్ధీకరించండి

శానిటరీ వర్కర్ల ఉద్యోగాలు క్రమబద్ధీకరించండి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న శానిటరీ వర్కర్లు, సూపర్‌వైజర్లు, ఎంటమాలజీ వర్కర్లు, సిబ్బంది ఉద్యోగాలను క్రమద్ధీకరించాలని మున్సిపల్‌శాఖ, జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై జీ శ్రీనివాసచారి, మరో 97 మంది ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. క్రమబద్ధీకరణపై రెండునెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేసే వరకు ప్రస్తుతం చేస్తున్న పనికి రెగ్యులర్‌ ఉద్యోగుల తరహాలో కనీస కాలానుగుణ వేతనవృద్ధి (టైమ్‌ స్కేల్‌)ని అమలుచేయాలని పేర్కొన్నది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలపై ‘ఉమాదేవి’ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని తెలిపింది.


logo