తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజన గురుకుల విద్యాలయ సంస్థల రాష్ట్ర స్థాయి ‘ఇగ్నైట్ ఫెస్ట్ అరెనా-2020’ కార్యక్రమంలో భాగంగా రాజేంద్ర నగర్, ఐఏఎస్ స్టడీ సర్కిల్ లోనీ గిరిజన గురుకుల విద్యాలయంలో నిర్వహించిన మాక్ యూత్ పార్లమెంట్, మోడల్ యునైటెడ్ నేషన్స్ కి హాజరై విద్యార్థుల ప్రతిభా పాటవాలను అభినందించారు. అనంతరం వారికి బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెసిడెన్షియల్స్ లేకపోవడంతో బాలికలు డిగ్రీ విద్య చదవడం లేదని గుర్తించి, బాలికలకు డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు సీఎం పెట్టించారన్నారు. మీ విశ్వాసం చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. నిజంగా భవిష్యత్ గొప్ప పార్లమెంటరేయిన్స్ ను చూసినట్టు ఉందన్నారు. గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పనితీరు కూడా ఎంతో బాగుందన్నారు. తల్లిదండ్రులు గురుకులాల్లో మా బిడ్డలకు మంచి భోజనం, విద్య అందుతుంది అని, భవిష్యత్ ఉంటుందని ఇక్కడకు పంపుతున్నారు. వారి నమ్మకాలను నిజం చేసే విధంగా కష్టపడి చదివి పైకి రావాలని విద్యార్థులకు సూచించారు.
ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..మన ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో మంత్రి సత్యవతి రాథోడ్ నిరంతర ప్రోత్సాహంతో గిరిజన గురుకులాలు దేశంలో గొప్ప చరిత్రను సృష్టించబోతున్నాయని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖారాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నవీన్ నికోలస్, గిరిజన సంక్షేమ అధికారులు సముజ్వల, విజయలక్ష్మి, యాదగిరి, కల్యాణి, శ్రీనివాస రెడ్డి, పద్మావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్‌లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్