e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home తెలంగాణ సంపద పెరిగింది

సంపద పెరిగింది

సంపద పెరిగింది
  • కొవిడ్‌ కాలంలోనూ జాతీయ సగటుకు మించి..తలసరి ఆదాయంలో ఉరుకులు
  • జీఎస్‌డీపీ రూ. 9,78,373 కోట్లు 
  • రాష్ట్రంలో 20.9% వృద్ధి రేటు 
  • సామాజిక-ఆర్థిక సర్వేలో వెల్లడి 

భూపరిపాలనలో తెలంగాణ నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టింది.  తెలంగాణ రాష్ట్ర భూమి హక్కులు- పట్టదార్‌ పాస్‌పుస్తకాల చట్టం- 2020ని అమల్లోకి తెచ్చింది. నూతన రెవెన్యూ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి.. ‘ఈ చట్టం ద్వారా రైతులకు భూవివాదాలు,  తగాదాల  నుంచి  శాశ్వత పరిష్కారం లభిస్తుంది కనుక.. నాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిననాడు ఎంత సంతోషం కలిగిందో,  ఈ రోజు కూడా  అంతే సంతోషం కలుగుతున్నది’ అన్నారు. 

-బడ్జెట్‌ ప్రసంగంలో హరీశ్‌రావు

ప్రత్యేకప్రతినిధి, మార్చి18, (నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని కరోనా కబళించినా.. తెలంగాణ రాష్ట్రం తట్టుకొని నిలబడ్డది. జాతీయ సగటు కంటే ఎంతో మెరుగైన ఫలితాలను సాధించింది. ఒకవైపు దేశ జీడీపీ 8% తగ్గుదల నమోదుకాగా, రాష్ట్ర జీఎస్‌డీపీ మాత్రం 1.26% మాత్రమే తగ్గింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 20.9 శాతం వృద్ధితో అపూర్వమైన ప్రగతిని సాధించింది. తలసరి ఆదాయంలో 0.61శాతం వృద్ధిరేటును నమోదు చేసుకున్నది.  రాష్ట్ర ప్రణాళికశాఖ సామాజిక ఆర్థిక సర్వే 2020-21లో వెల్లడించింది. గతేడాది (2019-20) అంచనాల కంటే ఈసారి సంపద కొంత తగ్గింది. నిరుడు సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల సంపద రూ.9,65,355 కోట్లు గా  ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22లో  రూ.9,78,373 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్ర సంపద లక్ష కోట్లకు పైగా పెరుగుతూ 10 శాతానికి పైగా వృద్ధిరేటు సాధిస్తున్నది. ముం దస్తు అంచనాల ప్రకారం ఈ సారి మన రాష్ట్ర సంపద  13,018 కోట్లు మాత్రమే పెరిగింది. వృద్ధిరేటు తగ్గినా జాతీయ సగటుతో పోలిస్తే ఇది ఎంతో మెరుగ్గా ఉన్నది. తెలంగాణ ఆవిర్భవించిన మొదటి సంవత్సరంలో  2014-15లో ప్రస్తుత ధరల వద్ద రూ.5 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర సంపద  ఏడేండ్లలో వందశాతం పెరిగింది. జాతీయ సగటుకంటే ఎక్కువ వృద్ధిరేటును సాధిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఇంజిన్‌గా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు స్థూల గృహోత్పత్తి రూ.4 లక్షల కోట్లుగా.. ప్రస్తుతం రూ.9.6 లక్షల కోట్లకు పెరిగింది. మరోవైపు రాష్ట్ర తలసరి ఆదా యం గణనీయంగా పెరిగింది. రాష్టం ఆవిర్భవించకముందు తలసరి ఆదాయం రూ.95,361కాగా  ఏడేండ్లలో ఎకాఎకిన  రూ.2.27 లక్షలకు పెరిగింది. 

రాష్ట్రంలో పురోగమనం..కేంద్రంలో తిరోగమనం 

తలసరి ఆదాయంలో వృద్ధిరేటును సాధించిన అతి కొద్ది రాష్ర్టాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. ప్రస్తుత ధరలవద్ద గతేడాది 2,25,756 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం ఈ సారి 2,27,145 రూపాయలకు పెరిగింది. గతంకంటే ఈ సారి 0.61 శాతం వృద్ధిరేటు చోటుచేసుకుంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో వృద్ధి రేటు తిరోగమనంలో ఉన్నది. దేశ జీడీపీ ప్రస్తుత ధరల్లో గత ఏడాది రూ.203.51 లక్షల కోట్లు కాగా  ఈసారి రూ.195.86 కోట్లకు తగ్గింది. ఈ తగ్గుదల దాదాపు -8 శాతంగా ఉన్నది. జాతీయ తలసరి ఆదాయంలో కూడా – 4.8 శాతం వరకు తగ్గింది. జాతీయ స్థాయిలో గత  సంవత్సరం 1,34,186 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం 1,27,768 రూపాయలకు తగ్గింది. 

తలసరి ఆదాయంలో వృద్ధి

తలసరి ఆదాయంలో వృద్ధిరేటును సాధించిన అతి కొద్ది రాష్ర్టాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. గతంకంటే ఈ సారి 0.61 శాతం వృద్ధిరేటు చోటుచేసుకుంది. 

కరెంటు వాడకంలో మనమే

తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలిచింది. దేశ సగటు తలసరి వినియోగం కంటే తెలంగాణలో 71 శాతం అధికంగా ఉన్నది. 

57.3% 

2036 నాటికి తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో జనాభా 57.3 శాతానికి చేరుకోనుంది. అదే సమయంలో దేశంలో 39.6% ఉంటుంది.

31,22,563  

సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పౌర సేవల కోసం తెచ్చిన హాక్‌ఐ మొబైల్‌ యాప్‌ను మార్చి 2020 వరకు 31,22,563 మంది పౌరులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

తెలంగాణ ఆవిర్భావానికి ముందు తర్వాత రాష్ట్ర సంపద పెరుగుతున్న తీరు రూ. కోట్లలో 

సంపద పెరిగింది
Advertisement
సంపద పెరిగింది

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement