శనివారం 11 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 18:53:49

తెలంగాణ హరితహారం ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి : ఎమ్మెల్యే కిశోర్‌

తెలంగాణ హరితహారం ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి : ఎమ్మెల్యే కిశోర్‌

తుంగతుర్తి : హరితహారంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు.  సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మినీ స్టేడియంలో 6వ విడుత హరితహారంలో భాగంగా శుక్రవారం ఆయన మొక్కల నాటింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి మాట్లాడుతూ తెలంగాణలో విడుతల వారీగా హరితహారం చేపట్టడంతో రాష్ట్రంలో అటవీ శాతం పెరుగుతుందన్నారు. తుంగతుర్తి స్టేడియంలో ఈ ఒక్కరోజే సుమారు 2000 మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటి పచ్చగా మార్చాలని కోరారు. ప్రజలంతా సీఎం కేసీఆర్‌ లక్ష్యాన్ని నెరవేర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, డీసీసీబీ డైరక్టర్‌ గుడిపాటి సైదులు, ఎంపీపీ కవిత, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


logo