శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 09, 2020 , 01:12:37

వలస కార్మికులకు నిత్యాన్నదానం

వలస కార్మికులకు నిత్యాన్నదానం

  • కొదురుపాకలో ఎంపీ సంతోష్‌కుమార్‌ ఔదార్యం

బోయినపల్లి: ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న సీఎం కేసీఆర్‌ పిలుపునకు ఎంపీ సంతోష్‌కుమార్‌ స్పందించారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు నిత్యాన్నదానం చేసేందుకు ముందుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని ఎంపీ స్వగ్రామం కొదురుపాకలో 200 మందికి సంతోష్‌కుమార్‌ చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ బుధవారం ప్రారంభించారు.

ఎంపీ సంతోష్‌ సహాయకుల విరాళం

ఎంపీ సంతోష్‌కుమార్‌ వ్యక్తిగత సహాయకుడు శ్రీకాంత్‌, సెక్యూరిటీ సిబ్బంది సీఎం ఆర్‌ఎఫ్‌కు రూ.50 వేలు విరాళంగా ఇచ్చా రు. వారిని ఎంపీ అభినందించారు. 


logo