బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 03:11:02

పథకాలకు నిధుల మంజూరు

పథకాలకు నిధుల మంజూరు

‘ఆసరా’కు 2,931 కోట్లు

ఆసరా పింఛన్లకు రూ. 2,931 కోట్లు మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. 38,50,562 మందికి పింఛన్లు ఇచ్చేందుకు రూ.2931,17,44,000 కేటాయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి ఈ నిధులు మంజూరుచేసినట్టు ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

బీసీ హాస్టల్‌లో డైట్‌ చార్జీలకు 40కోట్లు 

బీసీ సంక్షేమ వసతి గృహాలకు చెందిన విద్యార్థుల డైట్‌ చార్జీలకోసం రూ.40 కోట్లు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020-21 విద్యాసంవత్సరం ప్రారంభసమయంలో ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు నిధులు విడుదల చేసినట్టు వెంకటేశం పేర్కొన్నారు.  

నాలాల క్యాపింగ్‌కు 298 కోట్లు

హైదరాబాద్‌లో నాలాల మరమ్మతులు, క్యాపింగ్‌ పనులకు పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. రూ.298.34 కోట్ల నిధులు విడుదలచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిధులతో రెండు మీటర్ల వరకు వెడల్పు ఉన్న 382 నాలాలు, రెండు మీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు ఉన్న 90 నానాల పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ ప్రణాళిక సిద్ధంచేసింది.logo