శనివారం 04 జూలై 2020
Telangana - May 27, 2020 , 18:39:29

భారత్‌లో వరి ఉత్పత్తిలో తెలంగాణనే అగ్రస్థానం: ఎఫ్‌సీఐ

భారత్‌లో వరి ఉత్పత్తిలో తెలంగాణనే అగ్రస్థానం: ఎఫ్‌సీఐ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకలితీర్చే అన్నపూర్ణగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. వరి ధాన్యం సేకరణ, దిగుబడిలో దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. భారత్‌లో వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం సాధించింది. ఈ సంవత్సరం యాసంగి పంట వరి ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.

శుక్రవారం వరకు దేశంలో 83.01 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించగా తెలంగాణ వాటానే 52.23 లక్షల టన్నులుగా ఉందని ఎఫ్‌సీఐ తెలిపింది. దేశం నిర్దేశించిన లక్ష్యంలో సగం కంటే ఎక్కువ తెలంగాణ నుంచే దిగుబడి వచ్చిందని పేర్కొంది. దేశం నిర్దేశించుకున్న లక్ష్యం 91.07 లక్షల టన్నులని వెల్లడించింది.


logo