శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 23:28:52

రావిర్యాలలో ప్రభుత్వ మెగా డెయిరీ

రావిర్యాలలో ప్రభుత్వ మెగా డెయిరీ

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా డెయిరీ ఏర్పాటుకానున్నది. ఇందుకోసం 32.20 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీఎస్‌డీడీసీఎఫ్ఎల్) కు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది.

ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేంద్ర జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులలో.. మెగా డెయిరీ స్థాపన కోసం మామిడిపల్లి పెద్ద ఎత్తున గొర్రెల పెంపక క్షేత్రానికి చెందిన భూమిని లీజుకు ఇవ్వడానికి పశువైద్య, పశుసంవర్ధక డైరెక్టర్ సమ్మతి ఇచ్చారు. సంవత్సరానికి ఎకరానికి రూ.30,000 చొప్పున చెల్లిస్తారు.

ఇందు నిమిత్తం అవగాహన ఒప్పందంలో ప్రవేశించిన తేదీ నుంచి 99 ఏండ్ల కాలపరిమితికి లీజుకు బదిలీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే టీఎస్‌డీడీసీఎఫ్‌ఎల్ ప్రతి సంవత్సరం ఎకరానికి లీజు మొత్తాన్ని తెలంగాణ గొర్రెలు, మేకల సమాఖ్యకు మెగా డెయిరీ ప్రారంభించిన తేదీ నుంచి ఏటా 5 శాతం లీజు మొత్తాన్ని పెంచాల్సి ఉంటుంది. డైరెక్టర్ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బండ్రీ, టీఎస్‌డీడీసీఎఫ్ఎల్ తప్పనిసరిగా అవగాహన ఒప్పందంలో వచ్చి అవసరమైన చర్యలను ప్రారంభించాలని ఉత్తర్వులో పేర్కొన్నది.


logo