గురువారం 04 జూన్ 2020
Telangana - May 12, 2020 , 00:28:03

రికార్డు దాటిన ధాన్యం కొనుగోళ్లు

రికార్డు దాటిన ధాన్యం కొనుగోళ్లు

  • 38.27 లక్షల టన్నులు సేకరణ 
  • రైతుబంధు సమితి కంట్రోల్‌ రూం వెల్లడి 

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ఈ ఏడాది యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు రికార్డును దాటాయి. గతేడాది యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ సీజన్‌లో ఇప్పటికే 38.27 లక్షల టన్నులు సేకరించినట్టు రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. రికార్డు ధాన్యం కొనుగోలుపై సంతోషం వ్యక్తంచేసిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 7,527 కొనుగోలు కేంద్రాల ద్వారా సోమవారం వరకు 43,48,510 టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు జరిపినట్టు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరిగినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని పల్లా పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా రైతులు ఇబ్బంది పడకుండా పంటలను పూర్తిగా కొనుగోలు చేసేందుకు ప్రణాళికతో ముందుకెళుతున్నామన్నారు. 


ఉత్పత్తి కేంద్రాలు
సోమవారం కొనుగోళ్లు(టన్నులు)
మొత్తం కొనుగోళ్లు(టన్నులు) 
వరి ధాన్యం
6,308
1,43,298
38,27,333
మక్కజొన్న
1,094
10,120
4,36,969
శనగలు
88307
77,569
పొద్దుతిరుగుడు
14586,378
జొన్నలు
23188261

7,527
1,53,971
43,48,510logo