శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 15:03:39

సాదా బైనామాల‌కు ఇదే చివ‌రి అవ‌కాశం : సీఎం కేసీఆర్

సాదా బైనామాల‌కు ఇదే చివ‌రి అవ‌కాశం : సీఎం కేసీఆర్

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : ‌రాష్ర్టంలో సాదా బైనామాల గ‌డువు మ‌రో వారం పొడిగిస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. సాదాబైనామాల ద్వారా క్ర‌య‌, విక్ర‌యాలు జ‌రిపిన వాళ్లు చివ‌రి అవ‌కాశం వినియోగించుకోవాలి. భ‌విష్య‌త్‌లో సాదా బైనామాల‌కు అవ‌కాశం ఉండ‌ద‌ని తేల్చిచెప్పారు. భూముల క్ర‌య‌, విక్ర‌యాల‌న్నీ రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియ ద్వారా జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ఒక ల‌క్ష 64 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌న్నారు. ఈ వారం రోజుల్లో మీ సేవ‌, క‌లెక్ట‌ర్ ఆఫీసుల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రూపాయి ఖ‌ర్చు లేకుండా ప‌ట్టాలు చేసి పాస్‌బుక్ జారీ చేస్తార‌ని తెలిపారు. వారం త‌ర్వాత‌ సాదాబైనామా ఉండ‌దు. రిజిస్ర్టేష‌న్ ద్వారానే భూ మార్పిడి జ‌రుగుతుంద‌న్నారు. పోడు భూములు, అట‌వీ భూములు, వ‌క్ఫ్ భూముల వివాదాల‌ను కూడా ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ఈ స‌మ‌స్య‌ల‌కు స‌మ‌గ్ర స‌ర్వే స‌మాధానం చెబుతుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. 

తాజావార్తలు