బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 23:03:49

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు పెంపు

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌ : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఈ నెలఖారు(31వ తేదీ) వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. భారీ వర్షాలు, ఇంటర్‌నెట్‌ అవాంతరాలు, పవర్‌కట్‌ వంటి అంతరాయాల కారణంగా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి  ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గురువారంతో గ‌డువు ముగిసింది. పై కారణాలన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం గడువును పెంచుతూ నిర్ణయం వెలువ‌రించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఇప్పటివరకు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి.


logo