శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:30:35

210.49 కోట్ల మార్క్‌ఫెడ్‌ బకాయిలు విడుదల

210.49 కోట్ల మార్క్‌ఫెడ్‌ బకాయిలు విడుదల

  • రైతు ఖాతాల్లోకి పంటల కొనుగోళ్ల పైసలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన పంటలకు సంబంధించిన రూ. 210.49 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. విడుదల చేసిన మొత్తంలో మక్కజొన్న బకాయిలు రూ.198.23 కోట్లు, శనగ రూ. 4.09 కోట్లు, జొన్న రూ. 5.69 కోట్లు, పొద్దు తిరుగుడు బకాయిలు 2.48 కోట్లు ఉన్నట్టు మంత్రి స్పష్టంచేశారు. ఇందుకోసం కెనరా బ్యాంకు నుంచి మార్క్‌ఫెడ్‌కు రూ.వెయ్యి కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ప్రభుత్వ గ్యారెంటీతో మార్క్‌ఫెడ్‌కు రూ.3213 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించినట్టు తెలిపారు. logo