సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 16, 2020 , 11:43:41

ప్రభుత్వం వేసిన రూ.1500 ఎప్పుడైనా తీసుకోవచ్చు...

ప్రభుత్వం వేసిన రూ.1500 ఎప్పుడైనా తీసుకోవచ్చు...

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.1500 నగదు, కేంద్ర ప్రభుత్వం రూ.500 నగదు బ్యాంకు అకౌంట్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పైసలు తీసుకోవడానికి బ్యాంకుల వద్దకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. దీనిపై తెలంగాణ లీడింగ్‌ బ్యాంకు అధికారులను వివరణ అడగగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం జమ చేసిన పైసలు ఎప్పుడైనా తీసుకోవచ్చిన ప్రజలు బ్యాంకుల వద్ద గుమికూడవద్దని విజ్ఞప్తి చేశారు. 

కొందరు పైసలు తీసుకోకుంటే వెనకకు వెళ్లిపోతాయన్న అపోహతోనే బ్యాంకులకు పరుగులు తీస్తున్నారని, అది పూర్తిగా తప్పని వెల్లడించారు. ఆ పైసలు మీ ఖాతాల్లోనే  జమ ఉంటాయి. ఎక్కడికి వెళ్లవని వివరణ ఇచ్చారు.  బ్యాంకుల వద్ద గుంపుగా చేరితే లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించారు. ప్రజలు బౌతిక దూరం పాటించాలని కోరారు. 


logo