శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:03:11

గామ మోనోగ్రాఫ్‌ ఆలోచన అద్భుతం

గామ మోనోగ్రాఫ్‌ ఆలోచన అద్భుతం

  • గాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామాలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను ఒకేచోటకు తీసుకొచ్చేందుకు గ్రామోదయ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ (జీకాట్‌) చేసిన ‘గ్రామ మోనోగ్రాఫ్‌' ఆలోచన అద్భుతమైనదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. జీకాట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో శనివారం ఆన్‌లైన్‌ ద్వారా తమిళిసై పాల్గొని మాట్లాడారు. రైతులకు మరింత మేలు చేసేందుకు ఒక ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి దానిద్వారా తెలంగాణ సోనా వరిరకం వంగడాన్ని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీతో కలిసి జీకాట్‌ అభివృద్ధి చేయడం అభినందించాల్సిన విషయమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు గ్రామ మోనోగ్రాఫ్‌ల రూపకల్పనకు జీకాట్‌తో కలిసి పనిచేయాలని సూచించారు.