శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 20:47:09

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి : మంత్రి పువ్వాడ

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి : మంత్రి పువ్వాడ

ఖమ్మం : రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం రైతులకు ఆయన పంట రుణాలు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో అన్నదాతలకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా, సాగుకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌, మిషన్‌ కాకతీయ పథకాలు అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. వ్యవసాయం దండగన్న ప్రాంతంలో సాగును పండుగగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. మొత్తం 55 మందికి రైతులకు రూ.34 లక్షల రుణాలను పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo