e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home Top Slides నల్లగొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు

నల్లగొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు

హైదరాబాద్‌ : నల్లగొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం హామీలను తక్షణం అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వేములపల్లి వద్ద తోపుచర్ల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలిచ్చింది. రూ. 9.3 కోట్లతో దీన్ని నిర్మించాలని నిర్ణయించింది. దామరచర్ల మండలం తుండపాడువాగుపై మరో ఎత్తిపోతలను, రూ.322.22 కోట్లతో వీర్లపాలెం రెండోదశ ఎత్తిపోతల పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది.


కట్టంగూరు మండలం చెరువు అన్నారం వద్ద రూ. 101.62 కోట్లతో అయిటిపాముల ఎత్తిపోతల పథకానికి అనుమతులిచ్చింది. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం స్వరూపం, పనుల్లో మార్పు చేసింది. గతంలో చేపట్టిన నెల్లికల్లు పనులకను ప్రీక్లోజర్‌ చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించనుంది. రూ.664.80 కోట్లతో నెల్లికల్లు ఎత్తిపోతలకు కొత్తగా నీటిపారుదలశాఖ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. నెల్లికల్లు వద్ద పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం, ఇతర పనులకు అనుమతులు ఇచ్చింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana