సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 01:32:38

చేనేతకు జవసత్వాలు

చేనేతకు జవసత్వాలు

  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం చేనేత పరిశ్రమకు పూర్తి జవసత్వాలు అందిస్తున్నదని రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా అప్రోచ్‌ ఫర్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ-ద గ్లోబల్‌ పర్‌స్పెక్టివ్‌'పై నిర్వహించిన జాతీయ వెబినార్‌లో న్యూఢిల్లీ నుంచి వినోద్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో చేనేతరంగం అభివృద్ధి పథకంలో పయనిస్తున్నదని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నేతన్నలు ఆకలిచావులు చూశామని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో వరంగల్‌ జిల్లాలో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ ఏర్పాటుతో చేనేత కార్మికులు సహా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. వెబినార్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు నరేందర్‌సింగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు రామేశ్వర్‌రావు, చేనేత రంగ నిపుణులు డాక్టర్‌ పీఎల్‌ పాండా, ప్రొఫెసర్లు కవిత, రమణనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo