మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 08:27:39

అనుక్షణం.. అప్రమత్తం

అనుక్షణం.. అప్రమత్తం
  • కరోనా వైరస్‌పై ప్రభుత్వం మరింత అలర్ట్‌
  • నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా
  • తెలంగాణలో నాలుగో కరోనా కేసు నమోదు
  • స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. కోట్లమంది ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పుడు సీఏఏ విషయంలో ముం దుకెళ్లడం మంచిదికాదని ఎన్డీఏ ప్రభుత్వానికి హితవుచెప్పారు. ఒక మతాన్ని మినహాయిస్తూచేసే రాజ్యాంగ వ్యతిరేకచర్యకు మద్దతు తెలిపేదిలేదని స్పష్టంచేశారు. సీఏఏ అన్నది కేవలం హిందూముస్లింల సమస్య కాదన్నారు. నిరసనలతో ఇప్పటికే దేశం నలుమూలలా లొల్లి అంటుకొన్నదని.. ఇలాంటప్పుడు విభజన రాజకీయాలు దేశానికి అవసరమా అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని పునస్సమీక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మా నం ప్రవేశపెట్టారు. సుదీర్ఘచర్చ అనంతరం సభ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానంపై చర్చను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వాలను ఏర్పాటుచేసేందుకు వినియోగిస్తున్న ఓటరుకార్డులు.. పౌరసత్వానికి రుజువులు కావా అని ప్రశ్నించారు. సీఏఏ తీర్మానంపై సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

మనపై బాధ్యత ఉన్నది

కొన్ని నెలలుగా సీఏఏపై అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తున్నది. ఈ పరిస్థితుల్లో భారత రాజ్యాంగ లౌకికతత్వంపై విశ్వాసం కలిగిన వారందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఒక భిన్నమైన స్వరూపం.. వందల ఏండ్ల కాస్మొపాలిటన్‌ కల్చర్‌.. భిన్న సంస్కృతులకు ఆలవాలంగా ఉన్న తెలంగాణ తప్పకుండా ఈ విషయంపై స్పందించాల్సిన అవసరమున్నది. సీఏఏపై రాష్ట్రప్రభుత్వం తరఫున ఇప్పటికే క్యాబినెట్‌లో తీర్మానంచేసి చెప్పాం. పార్లమెంట్‌లోకూడా బిల్లు వచ్చినపుడు తీవ్రంగా వ్యతిరేకించాం. ఈ దేశంలో ఇప్పటికే ఈ తీర్మానం పాస్‌చేసిన ఎనిమిదో రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది.
దేశంలో క్రియాశీలకంగా ఉన్న తెలంగాణ.. జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నది. దేశ జీడీపీకి అతి ఎక్కువగా కాంట్రిబ్యూట్‌చేసే రాష్ర్టాల్లో తెలంగాణ ప్రథమ వరుసలో ఉంటుంది. సామాజిక భద్రత, భవిష్యత్తుకోసం ఏంచేయాలో తగిన సూచనచేసే బాధ్య త మనమీద ఉంటుంది. అందుకే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాం. ప్రపంచ మానవాళి వసుధైక కుటుంబం అని కలలు కంటున్న సందర్భం ఇది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎల్లలు చెరిపివేసింది. బార్డర్స్‌ని బద్దలు కొట్టేసింది. ఒక్క మెస్సేజ్‌ క్షణాల్లో వంద దేశాలకు పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో ఈ బిల్లు సృష్టిస్తున్న ప్రకంపనలు ఎంతవరకు సమంజసమనే చర్చ దేశంలో జరుగుతున్నది. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నాం.

‘గోలీ మారో సాలోంకో’.. ఇదెక్కడి భాష?

విదేశీ ప్రతినిధులు దేశంలో పర్యటించేసమయంలో ఎవరమైనా కొంత సంయమనం పాటిస్తాం. దేశం పరువు, ప్రతిష్ఠ, మర్యాదకు సంబంధించిన అంశం కాబట్టి ఆలోచిస్తాం. స్వయంగా అమెరికా అధ్యక్షుడు దేశంలో పర్యటిస్తున్న సమయంలో 50 మంది పైచిలుకు పౌరులు ఢిల్లీలో చనిపోయారు. అది మతకల్లోలమా? వేరే కల్లోలమా.. ఏదైనా కావచ్చు. ఎంపీలు, కేంద్రమంత్రుల నోట దుర్మార్గమైన వ్యాఖ్యలు కూడా విన్నం. చాలా బాధాకరం. 70 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత ‘గోలీమారో సాలోంకో’ అంటే.. ఇదేం భాష? ఎక్కడి బాధ్యత? ఇది దేశానికి అవసరమా? ఇది ఏ రకంగాకూడా వాంఛనీయం కాదు. దేశ పౌరసమాజం ఇలాంటి అల్లర్లను ఏ రకంగానూ ఒప్పుకోదు. ఇది తాత్కాలికంగా కొందరికి ఆనందం కలిగించొచ్చు. మంచి పునాదులమీద, మంచి ఆలోచనలతోని ముందుకుపోతే అది నిలబడుతది కానీ, తాత్కాలికంగా టెంప్టేషన్‌ క్రియేట్‌ చేసి రాక్షసానందం పొందడం దేశం మొత్తానికి మంచిదికాదు. అంతర్జాతీయంగా మన ఖ్యాతి, సెక్యులర్‌ విధానం.. రా జ్యాంగ ప్రవేశికలో చెప్పుకొన్న లక్ష్యానికి పూర్తి గా వ్యతిరేకం. ఇది మనసును కలచివేస్తున్నది.

ట్రంప్‌ గోడ కడుతా అన్నాడు..

ఏ దేశానికైనా పౌరసత్వముండాలి. చట్టం కూ డా ఉండాలి. వద్దని ఎవరూ అనరు. దేశంలో చొరబాటుదారులను అనుమతించాలని ఎవరైనా చెబుతారా. ఎవరూ చెప్పరు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో పక్కనే ఉండే మెక్సికో నుంచి చొరబాటుదారులు రా కుండా గోడనే కడుతా అన్నడు. భారత్‌ కూడా మయన్మార్‌ వద్ద కడుతాం అంటే మేం సపోర్టుచేయడానికి సిద్ధం. ఇంకేదన్నా బార్డర్‌లో కడుతామంటే వద్దనం. బార్డర్‌లో సైనికులు కాపలా కాస్తెనే కదా మనం ఈరోజు శాంతియుతంగా అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నాం. దేశంలోప ల విభజన విధానాలు వద్దని వాదిస్తున్నాం.

నిర్ణయం చెప్తే దేశద్రోహి అంటారా?

నాలెక్క మాట్లాడినోల్లందర్నీ దేశద్రోహులంటారా.. వీడు పాకిస్థాన్‌ ఏజెంట్‌, దేశద్రోహి అంటారా.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేస్తే అసెంబ్లీ అసెంబ్లే దేశద్రోహా..? ఇదేం వితండవాదన. ఈ అసహన వైఖరి దేశానికి మంచిది కాదు. దేశం అంగీకరించదు. స్పష్టంగా చెప్తు న్నాం. భేషజాలు లేవు. లౌకిక పునాదుల మీద భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడిన పార్టీ మాది. సచ్చినా బతికినా, అధికారంలో ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటం. ఉంటం కాబట్టే బాజాప్త పార్లమెంట్లో ఢంకా బజాయించి చెప్పాం. కేంద్రమంత్రులు ఫోన్‌ చేస్తే చెప్పిన. సారీ వి కెనాట్‌ సపోర్ట్‌ దిస్‌ అని.


గతంలోనే విఫలమైంది

వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడే అద్వానీ కమిటీ దీనిపై సవరణలు సూచించింది. మల్టీపర్పస్‌ నేషనల్‌ ఐడెంటిటీ కార్డు అందరికీ ఇవ్వాలని ప్రయోగంచేశారు. వివిధ రాష్ర్టాల్లో 30.9 లక్షల మంది దగ్గర వివరాలు సేకరించి 12 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇవ్వగలిగారు. ఈ ప్రాజెక్టు సఫలం కావడంలేదని కేంద్రమే పక్కనపెట్టింది. ఫెయిలైందని ప్రకటించింది. 2011లో కేంద్ర హోంశాఖ మంత్రి గురుదాస్‌ కామత్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత పత్రాలు అందుబాటులో లేవని చెప్పారు. నేనూ అదే చెప్పా..‘డాక్యుమెంట్‌ బేస్‌ ఈజ్‌ వీక్‌ బికాజ్‌ సో మెనీ గరీబ్‌ కేసీఆర్స్‌ ఇన్‌ ద కంట్రీ అని. సర్టిఫికెట్లు లేనివారు ఎందరో ఉన్నారు.
ఆయనకే లేదంటే మీ తండ్రిది తాతది అంటే యాడికెళ్లి తెస్తరు. ఇలాంటి పేద కేసీఆర్‌లు? దేశ విభజన జరిగినప్పుడు, బంగ్లాదేశ్‌ పాకిస్థాన్‌నుంచి విముక్తి పొందినప్పుడు లక్షల మంది భారత్‌కు తరలివచ్చారు. యూఎన్‌ఓ ఆదేశాలమేరకు మన ప్రభుత్వం వారిని కాందిశీకులుగా గుర్తించి చోటు కల్పించాం. మన రాష్ట్రంలోనూ కాందిశీకుల శిబిరాలు ఉన్నాయి. పదివేలమంది ఉన్నరు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వాళ్లే గెలుస్తరు. వారిని భారత పౌరులు కాదనగలమా? దీన్ని చేయాలంటే సంయమనంతో, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను పిలిచిచేయాలి. ఇది విఫల ప్రయోగం అని ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలు పార్లమెంట్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో నిగ్గు తేలింది. మళ్లీ అదే బేస్‌ మీద చేస్తమని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నది. దేశ ప్రజలను మానసికవ్యధకు గురిచేసే పరిస్థితులు తేవటం అవసరమా? కేంద్రం చేయాలనుకుంటే బాజాప్త చేయాలి బేజాప్త ఎందుకు చేస్తరు. దేశంలో ఉన్న మొత్తం వ్యవస్థకు చెప్పిచేయండి.

చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి

ఎన్పీఆర్‌చేస్తం. ఎన్నార్సీ చేయమంటున్నరు. కానీ ఫైనల్‌గా అదే జరుగుతుంది. కేంద్రం మాటలు ఎవరూ నమ్మడం లేదు. రొట్టెలు చేయనపుడు పిండి ఎందుకు దంచుతున్నవ్‌? ఎన్పీఆర్‌ అనేది ఎన్నార్సీకి మొదటి అడుగు అని హోంశాఖ పార్లమెంట్‌లో పెట్టిన వార్షిక నివేదికలో స్పష్టంగా చెప్పింది. పార్లమెంట్‌ రిపోర్టులో ఒకవిధంగా, బయట మరొకవిధం గా చెప్పడంవల్ల అనేక సందేహాలు వస్తున్నయి.

వలస బతుకులు చూసి ఏడ్చాను

ఆదిలాబాద్‌ నార్నూర్‌ మండలం పోయా. మూరుమూల అటవీప్రాంతం అది. రాత్రి వేళ కొందరు కనిపించి నమస్తేపెట్టారు. ఎవరు అని అడిగితే పాలమూరు అన్నారు. ఇక్కడెందుకు ఉన్నరు అంటే.. ఎవరో కాంట్రాక్టరు రోడ్డు పట్టుకున్నడు సర్‌.. పనులకోసం తీసుకొచ్చిం డు సర్‌ అన్నారు. అక్కడ్నే ఎమోషనల్‌ అయి కండ్ల నుంచి నీళ్లు కారాయి. ఏం పాలమూరు బతుకు ఇది అని బాధపడ్డా. ఏడ్చుకుంటూ వచ్చాను. ఇలా సామాన్య ప్రజలు బతికేందుకు పోతరు. నివాసాలు మారుతయి. పోతం వస్తం. పలు కారణాల వల్ల కుటుంబాలు చెల్లాచెదురై వలస జరుగుతుంది. ఇలాంటి క్లిష్టమైన అంశాల్లో ఇలాచేయడం వల్ల దేశంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఎవరు మాట్లాడినా దేశద్రోహులనే కొత్త ట్రెండ్‌ మొదలైంది. సోషల్‌ మీడియా, మరో మీడియాలో ఈరకంగా ప్రచారం చేయడం మంచిది కాదు. పౌరసత్వ సవరణ చట్టంలో పేర్కొన్న నిబంధన.. రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మధన్‌ లోకూర్‌ చెప్పారు. వీరు కూడా పాకిస్థాన్‌ ఏజెంటేనా? దేశద్రోహి అందామా..? ఇలాంటి చట్టం దేశప్రజలకు ఏ విధంగా మంచిది?

అదే పెద్ద తప్పు

మనది కులాతీత, మతాతీత రాజ్యాంగమని పేర్కొన్నారు. దురదృష్టమేమిటంటే ఈ చట్టం లో ముస్లింలను మినహాయించి అని పేర్కొన్నారు. ఒక వర్గాన్ని ప్రత్యేకంగా వేరుచేయడం ఎలా సాధ్యం? రాజ్యంగం దీన్ని అనుమతించదు. రాజ్యాంగ వ్యతిరేకచర్య కాబట్టి భారత ప్రభుత్వం పునస్సమీక్షించాలని విజ్ఞప్తిచేస్తున్నాం. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని అడుతున్నాం. ఇంత మంది అనుమానంలో ఉండగా ముందుకు వెళ్లడం దేశానికి మంచిది కాదు. నేషనల్‌ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలంటే ఇవ్వండి. దానికి ముందు అందర్నీ కన్విన్స్‌ చేయండి. ఒప్పించి ముందుకు వెళ్లం డి. అందరి మద్దతుతో చేయండి. ప్రభుత్వం మాకోసం పనిచేస్తుందని ప్రజలు అనుకోవాలి కాని, భయాందోళనలు సృష్టించడం సరికాదు. నూతన ఆలోచనతో ముందుకు రావాలి. అప్పుడు మద్దతు తెలుపుతాం. వ్యతిరేకించాలన్నదే మా ఉద్దేశం కాదు. ప్రజల అనుమానాలు ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం మంచిది కాదని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఎవరి అభిప్రాయాలు వారివి

మేం మజ్లిస్‌తో కలిసి పనిచేస్తం. మేం మిత్రపక్షం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నం. అయినంతమాత్రాన అన్ని విషయాల్లో ఒకేవిధమైన అభిప్రాయాలు ఉండవు. ఆర్టికల్‌ 370 విషయంలో మద్దతు తెలిపాము. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మద్దతు తెలిపాం. కొన్నింట్లో ఒకేవిధంగా ఉంటుంది కావచ్చు. దీనికేదో ముడిపెట్టి మాట్లాడటం సరికాదు.

హిందూ ముస్లిం సమస్య కాదు

40, 45 ఏండ్ల నుంచి పబ్లిక్‌లైఫ్‌లో ఉంటున్న. అన్నిరకాల పదవులు చేశా. కానీ ఇది కాదు ఆశించింది. మనదేశంలో ఇలాంటి మాటలు వినవలసివస్తుందని అనుకోలేదు. దేశంలో అనేక సమస్యలున్నాయి. రైతులు, తాగునీరు, సాగునీరు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలున్నాయి. వాటన్నింటినీ వదిలిపెట్టి కొంపలంటుకుపోతున్నాయన్నట్లు దీన్ని తేవడం కల్లోలం రేపడమే. ఈ కల్లోలం రేపు ఎక్కడికి దారితీస్తుంది? ప్రపంచవేదికలపై మన ఖ్యాతి ఏం కావాలి? ఇది ముస్లిం సమస్య కాదు. హిందూ సమస్య కాదు. యావత్‌దేశ సమస్య ఇది. 130 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయమిది. ఇంతకాలం పబ్లిక్‌లైఫ్‌లో ఉన్నాం. నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు. ఎందుకంటే ఆరోజుల్లో దవాఖానలులేవు. చింతమడక అనే ఊళ్లో పుట్టిన. బర్త్‌ సర్టిఫికెట్‌ ఎక్కడినుంచి తేవాలి? రికార్డులు లేవు. ఒకస్థాయి కుటుంబంలో ఉన్న నా పరిస్థితే ఇట్లుంటే.. సామాన్యుడి పరిస్థితి ఏమిటి. కూలి చేసుకొనేవాళ్లు.. దళితులు, సంచారజాతులు, నిరక్షరాస్యుల పరిస్థితి ఏమిటి?

అసెంబ్లీ తీర్మానంపై సంబురాలు

సీఏఏను పునఃపరిశీలించాలని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రహోంశాఖకు పంపడంతో ముస్లింలు హర్షం వ్యక్తంచేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ సోదరులు సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో జెడ్పీ కోఆప్షన్‌ మాజీ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్‌, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ ఎండీ ఫక్రొద్దీన్‌ అధ్యర్యంలో మైనార్టీ నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, పటాకులు కాల్చారు. అనంతరం స్వీట్లు పంపిణీచేశారు. ‘హిందూ.. ముస్లిం భాయిభాయి’ అంటూ నినదించారు. ఖమ్మం నగరంలో ముస్లిం సోదరులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. దేశ ప్రజల మధ్య విధ్వేషాలను సృష్టించాడనికి కేంద్రం మతపరమైన చట్టాలను తీసుకువస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌లాంటి నాయకుడు దేశానికి ఒక్కడు చాలంటూ నినదించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎండీ ఖమర్‌, కార్పొరేటర్‌ షౌకత్‌అలీ, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అసద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్‌ కార్డు పనికిరాదా?

మరి నేనొక మాట అడుగుతా సమాధానం చెప్తారా ప్రశ్నించేటోళ్లు? సర్పంచ్‌ నుంచి ప్రధాని దాకా.. ప్రజలు ఓటర్‌కార్డు చూపించి ఓటువేస్తేనే ఎన్నికైతారు. భారతీయుడివని రుజువు చేసుకోవాలంటే ఆ ఓటరు ఐడీకార్డు పనిచేయదట. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌, రేషన్‌కార్డు.. ఇవేవీ పనిచేయవు. మరేం పనిచేస్తది? దేశంలో ప్రభుత్వాన్ని ఏ ఓటర్‌ ఐడీ కార్డయితే ఎన్నుకున్నదో ఆ కార్డే పనికిరాదంటే మీ ప్రభు త్వం ఉన్నదనుకోవాలా లేదనుకోవాలా? ఎవరు సమాధానం చెప్తారు? ఇదేమీ ఆషామా షీ విషయంకాదు. ఒక కేసీఆరో, తెలంగాణ రాష్ట్రమో, హైదరాబాదో కాదు కదా మాట్లాడుతున్నది? దేశం నలుమూలల అంటుకొని లొల్లి అయితున్నది. భారతదేశ ప్రతిష్ఠ గంగ లో కలుస్తున్నది. టైమ్స్‌ పత్రిక ఇన్‌టాలరెన్స్‌ ఇండియా అని మొదటిపేజీలో ప్రచురించింది. టుడే సిటిజన్‌ ఈజ్‌ ఎ గ్లోబల్‌ సిటిజన్‌, మనదేశం వారు లేని దేశం ఉందా ప్రపంచంలో.. అన్ని దేశాల్లో మన పిల్లలున్నారు. 50 దేశాల్లో టీఆర్‌ఎస్‌ శాఖలే ఉన్నాయి. పార్టీ వార్షికోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఈ పరిస్థితుల్లో విభజన రాజకీయాలు ఎందుకు. సంకుచిత రాజకీయాలు దేశానికి అవసరమా?

..ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధం

మరి నేనొక మాట అడుగుతా సమాధానం చెప్తారా ప్రశ్నించేటోళ్లు! సర్పంచ్‌ నుంచి దేశ ప్రధాని దాకా.. ప్రజలు ఓటర్‌ కార్డు చూపించి ఓటు వేస్తేనే ఎన్నికవుతారు. ఆ ఓటరు ఐడెంటిటీ కార్డు ఇప్పుడు పనికిరాదట. భారతీయుడివి అవునా.. కాదా అని రుజువు చేసుకోవాలంటే కార్డు పనిచేయదట. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు.. ఇవేవీ పనిచేయవు. మరి ఇంకేం పనిచేస్తది? దేశ ప్రభుత్వాన్ని ఏ ఓటర్‌ ఐడీ కార్డయితే ఎన్నుకున్నదో ఆ ఓటర్‌ ఐడెంటిటీ కార్డే పనికిరాదంటే మీ ప్రభుత్వం ఉన్నదనుకోవాలా లేదనుకోవాలా..?
50 మంది పైచిలుకు పౌరులు ఢిల్లీలో చనిపోయారు. అది మత కల్లోలమా, వేరే కల్లోలమా.. ఏదైనా కావచ్చు. పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులుగా ఉన్నవారి నోట చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు కూడా విన్నాం. చాలా బాధాకరం. 70 ఏండ్ల స్వతంత్రం తర్వాత.. ఇంత పరిణతి వచ్చిన తర్వాత.. ‘గోలీమారో సాలోంకో..’ అని అంటే ఇదేం భాష? ఎక్కడి బాధ్యత? ఇది ఈ దేశానికి అవసరమా? ఎవరి మంచిని ఆశించి ఇది? ఏ భవిష్యత్‌ను ఆశించి?- అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

రాజ్యాంగం అనుమతించదు..


మనది కులాతీత, మతాతీత రాజ్యాంగం. దురదృష్టం ఏమిటంటే సీఏఏ చట్టంలో ‘ముస్లింలను మినహాయించి’ అని పేర్కొన్నారు. ఒక వర్గాన్ని ప్రత్యేకంగా వేరుచేయడం ఎలా సాధ్యం? రాజ్యాంగం దీన్ని అనుమతించదు. అదే మేము వాదిస్తున్నాం. రాజ్యాంగ వ్యతిరేక చర్య కాబట్టి కేంద్రం పునస్సమీక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కోటానుకోట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తిచేయాలని అడుగుతున్నాం. ఇంతమంది అనుమానంలో ఉండగా ముందుకు వెళ్లడం దేశానికి మంచిదికాదు.

సైనికుడికి సలాం..


అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో పక్కనే ఉండే మెక్సికో నుంచి చొరబాటుదారులు రాకుండా గోడనే కడుతా అన్నడు. భారత్‌ కూడా మయన్మార్‌ వద్ద కడుతాం అంటే మేం సపోర్టు చేయడానికి సిద్ధం. ఇంకేదన్న బార్డర్‌లో కడుతామంటే వద్దనం. బార్డర్‌లో సైనికులు కాపలాకాస్తేనే కదా మనం ఈరోజు శాంతియుతంగా అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నాం. ఇంటికాడ ప్రశాంతంగా పడుకుంటున్నామంటే వారి దయనే కదా. ఆర్మీ పుణ్యం, త్యాగమే కదా. అందుకే దేశంలోపల విభజన విధానాలు వద్దు అని వాదిస్తున్నాం. మేం తప్పయితే దేశం మమ్మల్ని తిరస్కరిస్తది.

ఇది యావత్‌ దేశ సమస్య..


ఇది ముస్లిం సమస్య కాదు.. హిందూ సమస్య కాదు.. యావత్‌ దేశ సమస్య ఇది. ఇంతకాలం పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్నాం. నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో దవాఖానలు లేవు. చింతమడక అనే ఊళ్లో పుట్టిన. బర్త్‌సర్టిఫికెట్‌ కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి? రికార్డులు లేవు. ఒకస్థాయి కుటుంబంలో ఉన్న నా పరిస్థితే ఇట్లుంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? కూలిపని చేసుకునేవారు, దళితులు, సంచార జాతులు, నిరక్షరాస్యుల పరిస్థితి ఏమిటి? నాలాంటి అనేక లక్షలమందికి రికార్డులు లేవు.- అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

దేశానికి కేసీఆర్‌ నాయకత్వం అవసరం

సీఏఏ వ్యతిరేక తీర్మానంపై చర్చలో విప్‌ బాల్క సుమన్‌
కేంద్రంలోని ప్రభుత్వాలు ఏదో రకంగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయని, అన్ని వర్గాలకు న్యాయం చేసే పాలన రావాలంటే సీఎం కేసీఆర్‌ దేశానికి నాయకత్వం వహించాలని విప్‌ బాల్క సుమన్‌ అభిప్రాయపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని, అది సీఎం కేసీఆర్‌కే సాధ్యమవుతుందని చెప్పారు. దేశప్రజలంతా ఒకేజాతిగా ఉండేవారని, కానీ బీజేపీ, కాంగ్రెస్‌లు విభజన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.

కేంద్రానిది మొండి వైఖరి: ఎమ్మెల్యే గువ్వల

ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. సీఏఏను 80 శాతం మంది భారతీయులు వ్యతిరేకిస్తున్నా, ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలు అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానాలు ప్రవేశపెట్టినా కేంద్రం మొండి వైఖరిని అవలంబింస్తున్నదని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్నివర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పాలన కొనసాగించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తిచేశారు. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్న మైనార్టీవర్గాలకు సీఎం కేసీఆర్‌ అండగా ఉండటాన్ని ప్రతిఒక్కరూ ప్రశంసించాలన్నారు.

తీర్మానం హర్షణీయం: సీపీఎం, సీపీఐ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభ ఆమోదించిన తీర్మానం హర్షణీయమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ మూలసూత్రాలకు విఘాతం కలిగిస్తున్న ఈ చట్టాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బర్త్‌ సర్టిఫికెట్ల పేరుతో నిరక్షరాస్యులైన పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ను తీసుకొచ్చి దేశంలో మతాల మధ్య బీజేపీ చిచ్చుపెట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించినందుకు సీపీఐ రాష్ట్ర పార్టీ తరపున అభినందనలు తెలుపుతున్నామన్నారు.

తీర్మానం చరిత్రాత్మకం: ఎమ్మెఫ్‌సీ చైర్మన్‌

ఎన్పీఆర్‌, ఎన్సార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం చరిత్రాత్మకమని, సీఎం కేసీఆర్‌కు మైనార్టీలంతా రుణపడి ఉంటారని ఎమ్మెఫ్‌సీ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌ చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసినందుకు కృతజ్ఞతగా మాసబ్‌ట్యాంక్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈరోజే మాకు రంజాన్‌: టీఆర్‌ఎస్‌ నేత షరీఫుద్దీన్‌

సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్సార్సీకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజే తమకు రంజాన్‌ అని టీఆర్‌ఎస్‌ మాజీ కార్యదర్శి మహ్మద్‌ షరీఫుద్దీన్‌ చెప్పారు. ముషీరాబాద్‌ బిలాల్‌ మసీద్‌ వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో మైనార్టీలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఎంతో రుణపడి ఉంటామని పేర్కొన్నారు.


logo
>>>>>>