మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:00

ప్రజాభాగస్వామంతోనే గ్రామాల అభివృద్ధి

ప్రజాభాగస్వామంతోనే  గ్రామాల అభివృద్ధి

  • వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి రూరల్‌: ప్రజల భాగస్వామం ఉంటేనే గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా చందాపూర్‌లో మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో నిధులు అందిస్తుందని అన్నారు. వీధులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకొవాలని సర్పంచ్‌ను ఆదేశించారు. గ్రామంలో హరితహారం పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు. అంతకుముందు వనపర్తిలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో పలువురికి సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. logo