e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News దరఖాస్తు చేసిన 2 గంటలలోపే ఎల్ఓసీ..

దరఖాస్తు చేసిన 2 గంటలలోపే ఎల్ఓసీ..

దరఖాస్తు చేసిన 2 గంటలలోపే ఎల్ఓసీ..

హైదరాబాద్ : మెరుగైన వైద్యం కోసం రోగి దరఖాస్తు చేసుకున్న గంటన్నరలోనే ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లికి చెందిన రాజన్న (రఘునందన్) అనారోగ్యానికి గురై నిమ్స్‌లో చేరారు.

చికిత్స నిమిత్తం ఆయన భార్య సుప్రజ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహాయం కోరారు. సోమవారం సీఎం కార్యాలయానికి దరఖాస్తు పంపిన గంటన్నరలోనే రూ.2 లక్షలు మంజూరయ్యాయి.

ఆ వెంటనే సుప్రజకు మంత్రి ఎల్ఓసీ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సుప్రజ మాట్లాడుతూ.. ఇంత తొందరగా సాయం అందుతుందని ఊహించలేదని ఉద్వేగంగా అన్నారు.

తన భర్త వైద్యం కోసం రూ. 2 లక్షలు అందించిన సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్‌లకు తమ కుటుంబం, బంధుమిత్రులమంతా జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దరఖాస్తు చేసిన 2 గంటలలోపే ఎల్ఓసీ..

ట్రెండింగ్‌

Advertisement