శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 12:28:11

‘కుమురం భీం ఆశయ సాధనకు కృషి’

‘కుమురం భీం ఆశయ సాధనకు కృషి’

కుమురం భీం ఆసిఫాబాద్‌ :  కుమురం భీం ఆశయ సాధనకు తెలంగాణ‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కుమురం భీం 80వ వర్ధంతి  సందర్భంగా ఆ మహనీయుడిని మంత్రి స్మరించుకున్నారు. ఆదివాసులను ఏకం చేసి దోపిడీ, దౌర్జన్యాలు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి 

ప్రాణాలర్పించి ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి కుమురం భీం ప్రతీకగా నిలిచాడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే ఐక్యంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.

 గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. 500 మంది జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తించి గిరిజనుల స్వయంపాలన క‌ల‌ను సీఎం కేసీఆర్ సాకారం చేశార‌ని గుర్తుచేశారు. ముఖ్య మంత్రి హోదాలో కేసీఆర్‌ పోరుగడ్డ జోడేఘాట్‌ను సందర్శించార‌ని, ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషిచేస్తున్నార‌‌ని తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.