ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:20:55

రైతు శ్రేయస్సుకు నిరంతర కృషి

రైతు శ్రేయస్సుకు నిరంతర కృషి

  • మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌: రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి జ్ఞాపకార్థం నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. తెలంగాణ రైతులను దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలపడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. రైతు సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే రైతు వేదికల నిర్మాణం చేపట్టామని తెలిపారు. అనంతరం కమ్మర్‌పల్లి, ముప్కాల్‌తోపాటు, మోర్తాడ్‌ మండలం పాలెంలో రైతు వేదికల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని పరిశీలించారు.  logo