శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 15:49:53

సీఎం కేసీఆర్ కార‌ణజ‌న్ముడు: మ‌ంత్రి త‌ల‌సాని

సీఎం కేసీఆర్ కార‌ణజ‌న్ముడు: మ‌ంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్‌: సీఎం కేసీఆర్ కార‌ణ‌జ‌న్ముడ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ అన్నారు. కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో సంపూర్ణ విశ్వాసం ఉంద‌ని చెప్పారు. రైతుల బాధ‌లు ముఖ్య‌మంత్రికి తెలుస‌న్నారు. రైతుల‌కు మంచి చేసేందుకే నూత‌న రెవెన్యూ చ‌ట్టం తీసుకొచ్చార‌ని వెల్ల‌డించారు. త‌ద్వారా త‌ర‌త‌రాల బాధ‌ల‌కు చ‌ర‌మ‌గీతం పాడార‌ని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో క‌లిసి తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చ‌ట్టంతో భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని చెప్పారు. 

అన్నివ‌ర్గాల సంక్షేమ‌మే తెలంగాణ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ఎవ‌రూ ఆలోచించ‌ని విధంగా పేద‌ల‌కోసం కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో అద్భుత ప‌థ‌కాల‌ను ప్ర‌వేశపెట్టార‌ని వెల్ల‌డించారు. అన్ని రంగాల‌కు 24 గంట‌లు నాణ్య‌మైన విద్యుత్‌ను అందిస్తున్నార‌ని తెలిపారు. ప‌లు ప‌థ‌కాల ద్వారా ఆడ‌ప‌డుచుల‌కు అండ‌గా ఉన్నార‌ని చెప్పారు. గ‌డిచిన ఆరున్న‌రేండ్లుగా రైతుల కోసం సీఎం ఎంతో చేశార‌న్నారు. 

సీఎం కేసీఆర్ పాల‌న‌తోనే గ్రామ‌స్వ‌రాజ్యం సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. సీఎం మీద న‌మ్మ‌కంతోనే నియంత్రిత సాగుకు రైతులంద‌రూ స‌హ‌క‌రించార‌ని చెప్పారు. ఎమ్మెల్యేల‌కు క్యాంపు కార్యాల‌యాలు దేశంలో మ‌రెక్క‌డా లేవ‌ని పేర్కొన్నారు. గొర్రెల సంప‌ద‌లో రాష్ట్రానికి కేంద్ర‌ప్ర‌భుత్వం ఏ గ్రేడ్ ఇచ్చింద‌ని చెప్పారు. కుల‌వృత్తుల‌కు చేయూత‌నిచ్చేందుకు ఎన్నో ప‌థ‌కాలు తీసుకొచ్చామ‌ని వెల్ల‌డించారు. అన్ని మ‌తాల పండుగ‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వ‌మే గొప్ప‌గా నిర్వ‌హిస్తున్న‌ద‌ని చెప్పారు. 


logo