ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 18:42:51

గచ్చిబౌలి టిమ్స్ లో సిబ్బంది సేవలకు అనుమతి

గచ్చిబౌలి టిమ్స్ లో సిబ్బంది సేవలకు అనుమతి

హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చి (టిమ్స్‌)’ ఆస్పత్రిలో సిబ్బంది సేవలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 662 మంది సిబ్బంది సేవల వినియోగానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 662 మంది సిబ్బందిలో 502 మంది కాంట్రాక్ట్ బేసిస్‌లో , 12 మంది డిప్యుటేషన్ విధానంలో, 148 మంది ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలు అందించేందుకు సర్కారు పర్మిషన్ ఇచ్చింది. వీరు ఏడాదిపాటు సేవలు అందించనున్నారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. గచ్చిబౌలి టిమ్స్ లో 1500 పడకలు అందుబాటులో ఉన్నాయి. 


logo