శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 13:42:57

మృత్సకారుల కుటుంబాల్లో వెలుగు నింపడమే లక్ష్యం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మృత్సకారుల కుటుంబాల్లో వెలుగు నింపడమే లక్ష్యం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం : మృత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలం కొత్తగూడ సున్నం చెరువు, జైత్వారం, పులిమామిడి గ్రామ చెరువుల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 52 కోట్ల నిధులతో సబ్సిడీపై 82 కోట్ల చేప పిల్లలు చెరువులు, జలాశయాల్లో వదులుతున్నామని మంత్రి వెల్లడించారు. చేప పిల్లల నాణ్యతా, పరిమాణం, లెక్కింపులో తేడా లేకుండా వీడియో తీస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడ చెరువు సొసైటీ ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీపై వాహనాలను అందిస్తామని చెప్పారు. గతేడాది సున్నం చెరువు ద్వారా రూ. 2 లక్షల ఆదాయం రావటంపై ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది చేప పిల్లల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo