శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 17:33:08

కరోనా : తెలంగాణ ప్రభుత్వం కొత్తమార్గదర్శకాలు

కరోనా : తెలంగాణ ప్రభుత్వం కొత్తమార్గదర్శకాలు

హైదరాబాద్‌ : తెలంగాణలో రోజురోజుకూ కరోనా ఉద్ధతమవుతుండడంతో ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది.  సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల 22నుంచి జూలై 4వ తేదీ వరకు ఇవి అమల్లో ఉండనున్నట్లు పేర్కొంది.

ప్రభుత్వ మార్గదర్శకాలివే..

  • ప్రభుత్వ కార్యాలయాల్లో రొటేషన్‌ విధానంలో 50శాతం మంది సిబ్బంది మాత్రమే పని చేయాలి.
  • ప్రత్యేక చాంబర్లు ఉన్నవారు నిత్యం విధులకు హాజరుకావాలి.
  • విధులకు రాని ఉద్యోగులు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి. 
  • ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎవ్వరిని కార్యాలయాల్లో అనుమతించ కూడదు.
  • బీఆర్‌కే భవన్‌లో ఉద్యోగులకు వారం విడిచి వారం విధులు. 
  • గర్భిణులు, రోగులు సెలవులను వినియోగించుకోవచ్చు. 
  • అధికారుల డ్రైవర్లు పార్కింగ్‌లో కాకుండా వారి పేషీలో ఉండాలి.


logo