బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 19, 2020 , 02:34:49

శ్రీచైతన్య వల్లే నీట్‌ మూడో ర్యాంకు: స్నిఖిత

శ్రీచైతన్య వల్లే నీట్‌ మూడో ర్యాంకు: స్నిఖిత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీ చైతన్య విద్యాసంస్థలో రెండేండ్ల ఇంటిగ్రేటెడ్‌ నీట్‌ కోర్సులో చేరడం వల్లే ఆలిండియా మూడో ర్యాంకు సాధించగలిగానని నీట్‌ మూడో ర్యాంకర్‌ తుమ్మల స్నిఖిత తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని వీడియో విడుదలచేసినట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ ఆదివారం మీడియాకు వెల్లడించారు. మరో విద్యాసంస్థ స్నిఖిత తమ సంస్థలో నాలుగేండ్ల కోర్సు చదివినట్టు ప్రచారం చేసుకోవడాన్ని ఆమె ఖండించారు. ఓపెన్‌ క్యాటగిరీలో శ్రీచైతన్య విద్యార్థులు టాప్‌ 10లోపు మూడు ర్యాంకులను సాధించినట్టు ఆమె వివరించారు.


logo