శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 15:59:38

బోడుప్పల్‌లో తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుక‌లు

బోడుప్పల్‌లో తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుక‌లు

మేడ్చ‌ల్ మల్కాజ్‌గిరి : జిల్లాలోని  బోడుప్ప‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు అట్టహాసాలు, ఆడంబ‌రాలు లేకుండా  జ‌రిగాయి. కార్పొరేష‌న్ ప‌రిధిలోని ద్వార‌కాన‌గ‌ర్ లో స్థానిక కార్పొరేట‌ర్ సీసా వేంక‌టేశ్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు నిరాడంబ‌రంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ అమ‌ర‌వీరుల‌కు నివాళి అర్పించి జాతీయ‌జెండాను ఎగుర‌వేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు సాగాయి. ఈ సందర్భంగా వెంకటేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల అభ్యున్నతి,  శ్రేయస్సుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ‌ ధ్యేయంగా ప్ర‌తిఒక్క‌రూ ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్ లావ‌ణ్యాశేఖ‌ర్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత‌లు శేఖ‌ర్ రెడ్డి, స‌త్య‌రాజ్‌గౌడ్‌, శ్రీనివాస‌రావు, అర్జున్‌రావు, కృష్ణ‌మాచారి, స‌త్యం, విక్ర‌మ్‌బాబు, బాల‌కృష్ణ ప‌లువురు పాల్గొన్నారు.logo