శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 13, 2020 , 02:46:24

రాష్ట్రం పచ్చదనంతో నిండాలి

రాష్ట్రం పచ్చదనంతో నిండాలి
  • పట్టణప్రగతిలో నాటేందుకు మొక్కలు అందించాలి
  • క్షేత్రస్థాయి పర్యటనలో పీసీసీఎఫ్‌ శోభ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్రం పచ్చదనంలో నిండుదనాన్ని సంతరించుకోవాలని అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌ శోభ పేర్కొన్నారు. పచ్చదనంతోపాటు అడవుల పునరుద్ధరణ, అర్బన్‌ పార్క్‌ల ఏర్పాటుపై కలెక్టర్ల సమావేశంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన ఆదేశాలు, సూచనలను ఆమె క్షేత్రస్థాయి అధికారులకు వివరిం చారు. ఆయాజిల్లాల్లో పర్యటించి ప్రత్యక్షంగా పరిస్థితిని తెలుసుకోవాలని నిర్ణయించారు.


 ఈ క్రమంలో పీసీసీఎఫ్‌ ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం వరంగల్‌లో పర్యటించారు. కరీంనగర్‌, వరంగల్‌ సర్కిళ్ల అధికారులతో సమావేశమై సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన లక్ష్యాలను వారికి వివరించారు. పల్లెప్రగతిలో మాదిరిగానే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగే పట్టణప్రగతిలో పచ్చదనాన్ని పెంచడానికి అవసరమైన మొక్కలను అందించడంతోపాటు సాంకేతికపరమైన సహకారాన్ని అం దించాలని ఆదేశించారు. 


అటవీ విస్తీర్ణం తక్కువగాఉన్న ప్రాంతాల్లో అడవుల పునరుజ్జీవనం పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అటవీ భూముల ఆక్రమణ, స్మగ్లింగ్‌ను అరికట్టడంపై శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారని, ఈ విషయంలో కలెక్టర్లు, ఎస్పీల సహకారం తీసుకోవాలని స్పష్టంచేశారు. క్షేత్రస్థా యి పర్యటనలో అటవీశాఖ ఉన్నతాధికారులు ఆర్‌ఎం డోబ్రియాల్‌, ఎమ్సీ పర్గెయిన్‌, సిద్ధానంద్‌ కుక్రేటి, వరంగల్‌- కరీంనగర్‌, కొత్తగూడెం చీఫ్‌ కన్జర్వేటర్లు అక్బర్‌, రాజారావు తదితరులు పాల్గొన్నారు.


logo