మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 00:30:24

మన నేలల్లో విభిన్న స్వభావం

మన నేలల్లో విభిన్న స్వభావం

  •  ముఖ్యమంత్రికి యాపిళ్లను అందజేసిన కేంద్రె బాలాజీ
  • నేతలకు తెలంగాణ రుచిచూపించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో పండిన యాపిల్‌ తొలికాతను కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన రైతు కేంద్రె బాలాజీ మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అందజేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రికి మొక్క, పండ్ల బుట్టలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతు బాలాజీని అభినందించారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి యాపిల్‌ పంట ఒక ఉదాహరణ అని అన్నారు. ప్రగతిభవన్‌లో రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్నవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాపిల్‌ పండ్లను రుచి చూపించారు. కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రెండెకరాల్లో హెచ్‌ఆర్‌ 99 ఆపిల్‌ పంటను సాగుచేసినట్టు బాలాజీ తెలిపారు. ఉద్యానవనశాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో పంట సాగుపై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలిపారు. రైతు బాలాజీ సాగు చేస్తున్న చేనుకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో రహదారి నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చిన్నట్లు రైతు పేర్కొన్నారు. 


logo