బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 21:29:16

తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడేలా మారాలి: సీఎం కేసీఆర్‌

తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడేలా మారాలి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేసే విధానంపై ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల అధికారులు, రైతు బంధు సమితి అధ్యక్షులతో సీఎం కేసీఆర్‌ ముఖాముఖి నిర్వహించి, వారి అభిప్రాయాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేసి..రాష్ట్రంలోని రైతులంతా వందకు వందశాతం రైతుబంధు సాయం,  పండించిన పంటకు మంచి ధర పొందాలన్నది తన అభిమతమని పేర్కొన్నారు. 

మార్కెట్‌లో మంచి డిమాండ్‌, నాణ్యమైన పంటలు పండించడం ద్వారానే రైతులు మంచి ధర పొందగలుగుతారని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ఏ పంట వేయడం ద్వారా మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగిన సూచనలు చేస్తుంది. సూచనల ప్రకారం పంట సాగు చేస్తే రైతులకు ఏ ఇబ్బంది ఉండదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడే రైతాంగంలా మారాలి. రాష్ట్ర జీవికలో వ్యవసాయం ప్రధాన భాగం. వ్యవసాయ భవితం ఉజ్వలంగా ఉండాలి. ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తులు అందించి లాభాలు గడించాలన్నారు. 

రైతులంతా ఒకే పంట వేయడం ద్వారా డిమాండ్‌ పడిపోయి నష్టపోతున్నారని, ఈ పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి, నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేయాలని సూచిస్తున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి..? ఎక్కడ ఏ పంట సాగు చేయాలి..? ఏ రకం సాగు చేయాలనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉందో ఆగ్రో బిజినెస్‌ విభాగం వారు తేల్చారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగిన సూచనలు చేస్తుందని, ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేస్తే రైతులు నస్టపోయే అవకాశం ఉండదని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo