సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 18:42:02

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్‌: రైతు రుణమాఫీ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.   వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి  ఉత్తర్వులు జారీ చేశారు. 

  • రూ.1 లక్షల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ
  • 2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11 2018 ఈ తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు
  • బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న క్రాప్ లోన్ల లిస్ట్ వ్యవసాయ శాఖ తయారు చేయనుంది.
  • పట్టణాలు, మెట్రో పాలిటిన్ సిటీ హైదరాబాద్ లో తీసుకున్న లోన్లు రుణమాఫీకి వర్తించవు
  • కుటుంబంలో ఎంత మంది పేరు మీద క్రాప్ లోన్ ఉన్నా, ఒక్కరి రుణం మాత్రమే మాఫీ. కేవలం రూ.1 లక్ష మాత్రమే.
  • తొలి దశలో రూ.25వేలు లోపు ఉన్న రుణాలు మాఫీ
  • 01.04.2014 నుండి 11.12.208 వరకు తీసుకున్న వ్యవసాయ లోన్ లకు రుణమాఫీ వర్తింపు.
  • 2014 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న, రీషెడ్యూల్ చేసుకున్న రుణాల్లో 2018 డిసెంబర్ 11వ తేదీ వరకు ఉన్న బకాయిలు మాఫీ
  • రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని అందించనుంది.


logo