వాషింగ్టన్, జూన్ 26: అమెరికాలో ఓ వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 3 మిలియన్ల డాలర్లు (అక్షరాలా రూ.22 కోట్లు)! 4నెలల పాటు దవాఖానాలో ఉండి చికిత్స పొందిన ఆ వ్యక్తి… వైద్య ఖర్చుల బిల్లును వీడియో తీసి ‘టిక్‌టాక్’లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ అయి కొద్దిరోజుల్లోనే 95 లక్షల మంది చూశారు. ఆ వ్యక్తికి అందించిన వైద్య సేవల వారీగా దవాఖాన వసూలు చేసిన రుసుముతో కూడిన భారీ బిల్లును చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. వైద్య ఖర్చులు అత్యధికంగా ఉండే దేశంగా అమెరికాకు
పేరున్నది.