బుధవారం 03 జూన్ 2020
Telangana - May 17, 2020 , 18:30:24

సీఎం రిలీఫ్ ఫండ్‌కు తెలంగాణ డాక్యుమెంట్ రైట‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ విరాళం

సీఎం రిలీఫ్ ఫండ్‌కు తెలంగాణ డాక్యుమెంట్ రైట‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ విరాళం

హైద‌రాబాద్: కరోనా కట్టడికి  రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి త‌మ వంతు సాయం అందించేందుకు  తెలంగాణ డాక్యుమెంట్ రైట‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ వారు  ముందుకొచ్చారు. తమ బాధ్యతగా రూ.4 లక్షల విరాళాన్ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తో కలిసి ప్రగతి భవన్‌లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.  ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ, క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డానికి సీఎం కేసీఆర్‌ ఖ‌జానాని సైతం లెక్క చేయ‌కుండా ప్రజల  ప్రాణాలే ముఖ్యంగా పనిచేస్తున్నారన్నారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. విరాళం అందజేసిన  తెలంగాణ డాక్యుమెంట్ రైట‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ సభ్యులను మంత్రులు అభినందించారు.


 


logo