ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 14:02:34

త్వరలోనే తెలంగాణ డిజిటల్‌ మ్యాప్‌ : సీఎం కేసీఆర్‌

త్వరలోనే తెలంగాణ డిజిటల్‌ మ్యాప్‌ : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో త్వరలోనే తెలంగాణ డిజిటల్‌ మ్యాప్‌ను అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ కుటుంబాల డేటా బేస్‌ అంతా పోర్టల్‌లో ఉంటుందన్నారు. తెలంగాణ‌లోని ప్ర‌తి ఇంచు భూమిని స‌ర్వే చేయిస్తాం.. పక్కోడి భూమి మీద క‌న్నేయొద్దు. ఇంచు భూమిని కూడా ఇక‌పై ఆక్ర‌మించుకోలేర‌ని సీఎం తేల్చిచెప్పారు. ఇక నుంచి లైఫ్‌ టైమ్‌ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ డేటాబేస్‌ ఆధారంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడుతాయి. తెలంగాణ భూములపై డిజిటల్‌ మ్యాప్‌ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. త్వరలోనే సమగ్ర భూ సర్వే చేపట్టి ఒక్క ఇంచు భూమి కూడా వదలకుండా సర్వే చేస్తామని సీఎం అన్నారు. ఆదాయం కోల్పోయినా కొత్త విధానం తేవాలని సంకల్పించాం. ఇక నుంచి ప్రజలు ఎవరికీ నయా పైసా ఇవ్వొద్దు. కొన్ని అధికారాలు, ఆదాయం కోల్పోయినా ముందుకెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు.  కఠినమైనా సరే కొత్త రెవెన్యూ చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి చట్టాన్ని పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. భూ బకాసురులు, భూ మాఫియా నుంచి ప్రజలకు ఈ చట్టం విముక్తి కల్పిస్తుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. logo