మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:12

అభివృద్ధికి విఘాతం కలిగిస్తే ఊరుకోం: డీజీపీ

అభివృద్ధికి విఘాతం కలిగిస్తే ఊరుకోం: డీజీపీ

కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నమస్తేతెలంగాణ: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, మావోయిస్టులు విఘాతం కలిగించాలని చూస్తే ఊరుకునేది లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. కొద్దిరోజులుగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో శుక్రవా రం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. పదేండ్లుగా అనేక సంక్షేమ పథకాలు, సాగు నీటి ప్రాజెక్టులతో జిల్లా ప్రగతి సాధించిందని, ఆదివాసీలు, ప్రజలు ఎంతో అభివృద్ధి చెందారన్నారు. ప్ర శాంతంగా ఉన్న జిల్లాలోకి బోథ్‌కు చెందిన భాస్కర్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల మావోయిస్టు బృం దం చొరబడిందన్నారు. వారిని పట్టుకునేందుకు 500 మంది ప్రత్యేక పోలీసు బలగాలతో యాంటీ మావోయిస్ట్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


logo