శనివారం 30 మే 2020
Telangana - Apr 08, 2020 , 01:04:47

టాప్‌ 25 ఐపీఎస్‌లలో మహేందర్‌రెడ్డికి చోటు

టాప్‌ 25 ఐపీఎస్‌లలో మహేందర్‌రెడ్డికి చోటు

  • ఫేమ్‌ ఇండియా, ఏసియా పోస్ట్‌ అండ్‌ 
  • పీఎస్‌యూ వాచ్‌ సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో టాప్‌ 25 మంది ఐపీఎస్‌ అధికారుల జాబితాలో తెలంగాణ డీజీపీ ఎం మహేందర్‌రెడ్డికి చోటుదక్కింది. ఫేమ్‌ ఇండియా, ఏషియా పోస్ట్‌ అండ్‌ పీఎస్‌యూ వాచ్‌ సంస్థలు సంయుక్తంగా జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వేలో తెలంగాణ డీజీపీ టాప్‌ కాప్‌గా నిలిచారు. 1995కు ముందు ఐపీఎస్‌ బ్యాచ్‌లకు చెందిన మొత్తం నాలుగు వేల మంది ఐపీఎస్‌ అధికారుల నుంచి వడపోసి 200 మందిని గుర్తించారు. వీరిలో మళ్లీ వివిధ అంశాలవారీగా విభజించి అత్యుత్తమ సేవలందిస్తున్నవారిని ఎంపికచేసినట్టు నిర్వాహకులు తెలిపారు. జాతీయస్థాయిలో టాప్‌ 25 మంది ఐపీఎస్‌లలో డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అరవింద్‌కుమార్‌, రా చీఫ్‌ సమత్‌కుమార్‌ గోయల్‌, ఐటీబీపీ డీజీపీ ఎస్‌ఎస్‌ దేశ్వల్‌, సీఆర్పీఎఫ్‌ డీజీ ఏపీ మహేశ్వరి తదితరులు ఉన్నారు.

హరీశ్‌రావు ట్వీట్‌

తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమని, ఇంటిపట్టునే ఉండటమే మనం వారికి ఇవ్వగలిగిన గౌరవమని రాష్ట్ర మంత్రి టీ హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. ఇందుకు డీజీపీ ‘ధన్యవాదములు సార్‌' అంటూ సమాధానమిచ్చారు


logo