గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:05:32

మరో 1,879 పాజిటివ్‌

మరో 1,879 పాజిటివ్‌

  • జీహెచ్‌ఎంసీలోనే 1,422 మందికి కరోనా
  • ఒక్కరోజే 1,506 మంది బాధితుల డిశ్చార్జి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మంగళవారం 1,879 కరోనా కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,422 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. మంగళవారం ఒక్కరోజే 1,506 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్‌ మల్కాజిగిరి 94, కరీంనగర్‌ 32, నల్లగొండ 31, నిజామాబాద్‌ 19, వరంగల్‌ అర్బన్‌ 13, ములుగు, మెదక్‌ 12 చొప్పున, మహబూబ్‌నగర్‌ 11, సంగారెడ్డి, సూర్యాపేట 9 చొప్పున, కామారెడ్డి 7, జయశంకర్‌ భూపాలపల్లి 6, జోగుళాంబ గద్వాల 4, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం 3 చొప్పున, నాగర్‌కర్నూల్‌, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌, జగిత్యాల 2 చొప్పున, సిద్దిపేట, వనపర్తి, జనగామ, ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాలతో ఏడుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 313కు పెరిగింది. మంగళవారం 6,220 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,28,438కు చేరింది.

ఖాళీగా 92 శాతం పడకలు 

కరోనా రోగుల కోసం 17,081 పడకలను అందుబాటులో ఉంచినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇందులో 11,928 ఐసొలేషన్‌ బెడ్స్‌, 3,537 ఆక్సిజన్‌బెడ్స్‌, 1,145 ఐసీయూ, 471 వెంటిలేటర్‌ బెడ్స్‌ ఉన్నాయి. ఇప్పటివరకు 7.8 శాతం మాత్రమే నిండాయని పేర్కొన్నది. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
   మంగళవారం 
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,879
27,612
డిశ్చార్జి అయినవారు
1,506
16,287
మరణాలు
7313
చికిత్స పొందుతున్నవారు
-11,012


logo