బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 01:38:20

నేటినుంచి బడ్జెట్‌పై చర్చ

నేటినుంచి బడ్జెట్‌పై చర్చ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం నుంచి శాసనసభ, శాసనమండలిలో 2020-2021 వార్షిక బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు మొదట ప్రశ్నోత్తరాల (క్వశ్చన్‌ అవర్‌) కార్యక్రమం ఉంటుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభిస్తారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు తీర్మానాన్ని బలపరుస్తారు. మండలిలో చర్చను పురాణం సతీశ్‌ ప్రారంభిస్తారు. గంగాధర్‌గౌడ్‌ బలపరుస్తారు.


logo
>>>>>>